• Login / Register
  • No Administration In Telangana | పాల‌న గాలికి.. సీఎం, మంత్రులు ప‌క్క రాష్ట్రాల‌కు

    No Administration In Telangana | పాల‌న గాలికి.. సీఎం, మంత్రులు ప‌క్క రాష్ట్రాల‌కు
    పాలన వదిలి ముఖ్యమంత్రి, మంత్రుల పక్క రాష్ట్రాల పర్యటన పట్ల మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్
    పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్త‌మ సొంత జిల్లాలోనే వడ్ల కొనుగోళ్ళు జరగవు
    బిల్లులు విడుదల చేయడం లేదని గ్రామ పంచాయతీ కార్యాలయం తాకట్టు పెట్టే పరిస్థితి వచ్చినా ప‌ట్టించుకోని ఆర్థిక మంత్రి

    Hyderabad :  రాష్ట్రంలో ప‌రిపాల‌న ప‌క్క‌న పెట్టిన రాష్ట్ర ముఖ్యంత్రి రేవంత్‌రెడ్డితో పాటు మంత్రులు కూడా ప‌క్క రాష్ట్రాల‌కు వెళ్లుతున్నార‌ని, బీఆర్ఎస్ మాజీ మంత్రి  హ‌రీశ్‌రావు ఫైర్ అయ్యారు.  పాలన గాలికి వదిలి, ఝార్ఖండ్‌ ఎన్నికల ప్రచారానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కేరళకు మంత్రి సీతక్క, మహారాష్ట్రకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. క్యూ కట్టిన పరిస్థితి వ‌చ్చింద‌ని దుయ్య‌బ‌ట్టారు. మంత్రి  జిల్లాలోనే మద్దతు ధరకు పత్తి అమ్ముకోలేక రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నా కనికరించ‌ర‌ని విమ‌ర్శించారు. పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్త‌మ సొంత జిల్లాలోనే వడ్ల కొనుగోళ్ళు జరగడం లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఫుడ్ పాయిజనింగ్ జరిగి గురుకులాల్లో విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నా విద్యాశాఖ మంత్రిగా కూడా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ మాత్రం మొద్దు నిద్ర వీడ‌డం లేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. గారడి మాటలు చెప్పేందుకు గాలి మోటార్లు వేసుకుని బయల్దేరిన ముఖ్యమంత్రి, మంత్రుల్లారా.. మీరు చెప్పిన మార్పు అంటే ఇదేనా? హ‌రీశ్‌రావు సూటిగా ప్ర‌శ్నించారు. 
    *  *  *

    Leave A Comment